నల్లగొండ: ‘‘ప్రధాని మోడీ స్వంత రాష్ట్రంలో ఆసరా పింఛను రూ. 750 మాత్రమే. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఇచ్చేది రూ. 600. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఇచ్చింది సాలీనా రూ. 800 కోట్లే. కె.చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యాక ఇస్తున్నది రూ. 12,000 కోట్లు. కాగా రూ. 25000కోట్ల రుణ మాఫీ చేసింది ఒక్క తెలంగాణలోనే. డబుల్ ఇంజిన్లకు ట్రబుల్ ఇస్తున్నవి తెలంగాణ పింఛన్లు. ప్రజలు తిరగబడతారేమోనన్న భయం బిజెపిని వెంటాడుతోంది. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు అడ్డు పుల్లలు వేస్తోంది. రుణాలు రాకుండా మోకాలు అడ్డుతోంది. ముక్కు పిండి వసూలు చేసిన పన్నుల్లో వాటా చెల్లించడం లేదు. అయినా తెలంగాణలో కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు’’ అని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండ మండలంలో నూతన ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి హాజరయ్యారు. దీనికి రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు తక్కళ్లపల్లి రవీందర్ రావు, దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర నాయక్, మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, తదితరులు హాజరయ్యారు.
ఆసరా పింఛన్ల మంజూరీలో తెలంగాణ రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -