Sunday, January 19, 2025

తెలంగాణ ప్రభుత్వం 90 ఏళ్ళ అభివృద్దిని 9 సంవత్సరాల్లో చూపించింది:జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 90 ఏళ్ళ అభివృద్ధిని 9 సంవత్సరాల్లోనే చేసి చూపించిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దూరదృష్టితో కూడిన విధానాలు, పారిశ్రామిక విధానాలతో ఇది సాధ్యమైందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఎఫ్‌ఐఐసి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజి 2023 ఎక్స్‌పోను బుధవారం హైటెక్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరెంట్ కోతలు గత చరిత్రగా మారాయని అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో పవర్ హలిడేలు కనిపించవు. ఇవి తెలంగాణ ప్రభుత్వం సాధించిన కొన్ని విజయాలు మాత్రమే అన్నారు. సిఎం కెసిఆర్ విజన్‌కు రాష్ట్రంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న పారిశ్రామిక రంగం అద్దం పడుతుందన్నారు.రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా ఉంచిన ఘనత సిఎం కెసిఆర్‌దే అని, ఆయన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆర్థిక ప్రగతి సాధించిందన్నారు.

నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా వ్యవసాయ రంగంతో పాటు చేపల పెంపకం,మాంసం ఉత్పత్తులలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సాదించామన్నారు. మిల్లట్ల సాగులో మొదటి నుండి తెలంగాణా మొదటి స్థానంలో ఉందన్నారు. పత్తి వైపు రైతాంగం మొగ్గు చూపడంతో మిల్లట్ల సాగు తగ్గిందని అయితే ప్రస్తుతం ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మళ్ళి మిల్లట్ల సాగు పెరిగిందన్నారు.ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు తెలంగాణా లో తగిన ప్రోత్సాహం లభిస్తుండటంతో పారిశ్రామిక రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని,దానికి ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్ చలువే కారణమని ఆయన స్పష్టం చేశారు. అటువంటి నేత పరిశ్రమల మంత్రిగా ఉండడం పారిశ్రామిక వేత్తల అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు వినూత్నంగా తయారు చేస్తున్న ఉత్పత్తుల ప్రదర్శనలను జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు మీలా జయదేవ్, తారా సత్యవతి, విష్ణువర్ధన్ రెడ్డి,అనిల్ అగర్వాల్,శ్రీనివాస్ మహంకాళి, సురేష్ కుమార్ సింఘాల్,పాస్ పోర్ట్ అధికారి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News