Monday, December 23, 2024

ముఖ్యమంత్రి కెసిఆర్ దెబ్బకు దిగివచ్చిన మోడీ…

- Advertisement -
- Advertisement -

నల్గొండ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణలో కేంద్రం వెనక్కు తగ్గడం ముమ్మాటికి బిఆర్ఎస్ సాధించిన విజయమని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు దిగి వచ్చిన మోడీ సర్కార్ ఒకడుగు వెనెక్కి తగ్గిందన్నారు. తెలంగాణ రాష్ట్రం తరపున బిడ్డింగ్ లో పాల్గొంటున్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

Also read:  కెసిఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటది: మంత్రి కెటిఆర్

ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే మర్మం దాగి వుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల నేపద్యంలో అక్కడి ప్రజలను నమ్మించే ఎత్తుగడలలో ఇది భాగమై ఉండొచ్చు అని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వబోమంటూ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ మంత్రుల మాటలు అపరిపక్వతతో కూడినవంటూ ఆయన ఒక ప్రశ్నకు బదులుగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News