Monday, December 23, 2024

పార్టీలోనే జోడీ లేదు: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

minister jagadish reddy comments on rahul jodo yatra

సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరినీ జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ఎవరిని ఉద్దరిస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. సూర్యాపేటలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీకీ నాయకత్వ లోపమే పెద్ద శాపంగా మారిందని వ్యాఖ్యనించారు. మునుగోడు ఉప ఎన్నికలలో రెండవ స్థానం కోసమే కాంగ్రెస్, బిజెపి లు పోటీ పడుతున్నాయన్నారు. అక్కడ గెలిచేది టిఆరఎస్ పార్టీయేనని, ఎగిరేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలలో దేశానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు. యావత్ భారత దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుందని,రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ అభివృద్ధి దేశం మొత్తానికి విస్తరించాలి అన్నదే దేశ ప్రజల ఆకాంక్ష అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News