Friday, December 20, 2024

మంత్రి జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో వైభవంగా గణేష్ చతుర్థి వేడుకలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను సూర్యాపేట లోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం లో ఘ‌నంగా నిర్వ‌హించారు. క్యాంపు కార్యాలయం ప్రాంగ‌ణంలో మ‌ట్టి వినాయ‌కుడిని ప్ర‌తిష్టించి మంత్రి జగదీష్ రెడ్డి-సునీత దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, సూర్యాపేట ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశుడిని ఈ సంద‌ర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి వేడుకున్నారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి తండ్రి గారైన గుంటకండ్ల చంద్రారెడ్డి, కుమారుడు వేమన్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైర్. వి, ఎంపిపి నెమ్మాధి బిక్షం,ఉప్పల ఆనంద్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రౌతు నరసింహారావు, పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News