Sunday, January 19, 2025

బిఆర్‌ఎస్‌తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు అని రాష్టం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి పుట్టిందే బీఆర్ఎస్ అన్న మంత్రి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన నిర్వహించడం లో మోడీ ప్రభుత్వం విఫలమైతే, ప్రశ్నించడం లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. కోదాడ నియోజకవర్గం లో మోతె మండల మాజీ ఎంపిపి లింగారెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ నిర్ వీడి బీఆర్ ఎస్ లో చేరిన నేపథ్యం లో మామిళ్లగూడెం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో గులాబీ కండువా కప్పి బేఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… దేశంలో రాజకీయ ప్రలోభాలు లేనీ రాష్టం తెలంగాణ అని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేఖంగా పాలిస్తున్న మోడీనీ ప్రశ్నించడం లో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. దేశం లో దివాలా తీసిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం లో సైతం చేవ చచ్చింధని అన్నారు. ప్రధాని మోడీకి కార్యకర్తగా రాహుల్ మారాడన్నారు. ప్రజలకు ఏమి కావాలో తెలుసుకుని తెలంగాణను నంబర్ వన్ గా నిలబెట్టిన పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. కొత్త నాయకత్వన్ని దేశ ప్రజలు కోరుతున్నారని అన్నారు. 8ఏళ్ల పాలన లోనే తెలంగాణ ను నంబర్ వన్ గా మార్చిన కేసీఆర్ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహా పథకాలు దేశంలో ఎక్కడా లేవు అని అన్నారు.

పథకాల కోసం దేశం నలుమూల నుండి మన ప్రాంతానికి వలస వస్తున్నారని అన్నారు. మన ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసి మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చి దేశం ప్రజలకు మంచి చేయడానికి కేసీఆర్ చేసే యజ్ఞం మనమంతా భాగస్వామ్యం అవ్వాలని కోరారు. సందర్బం ఏదైనా బీఆర్ఎస్ కు ప్రజలు అండగా నిలబడాలని మంత్రి పిలుపునిచ్చారు. శాసన సభ్యులు బోల్లం మాట్లాడుతూ… గత పాలకుల హయాం లో అభివృద్ధి అంటే ఏంటో తెలియని కోదాడ ప్రజలకు అభివృద్ధిని పరిచయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షత కారణంగా కోదాడలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News