Sunday, November 17, 2024

సోయి లేని బండి మాటలు

- Advertisement -
- Advertisement -

Minister Jagadish Reddy fires at Bandi Sanjay

అతడికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు, తిక్క తిక్క మాట్లాడుతున్నారు, అవగాహన ఉందో లేదో
మరోసారి రాష్ట్ర రైతులను మరోసారి ఆగంచేసేందుకు ప్రయత్నిస్తున్నాడు : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇంకా బుద్ధివచ్చినట్లు కనిపించడం లేదని, ధాన్యంపై ఇంకా తిక్కతిక్క మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనకు అవగాహాన ఉండి మాట్లాడుతున్నారా? లేక మాట్లాడుతున్నారో అర్ధంకావడం లేదన్నారు. సోయిలేని మాటలు మాట్లాడుతూ…మరోసారి రాష్ట్ర రైతులను ఆగం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో శాసనసభ్యులు గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, మెతుకు ఆనంద్, కంచర్ల భూపాల్ రెడ్డి,మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, బండి సంజయ్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రాష్ట్ర రైతులను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన ఏదో చెప్పాలని…ఏదేదో చెప్పుతున్నారన్నారు.

రాష్ట్ర రైతులను తాము ప్రత్యామ్నాయ పంటల కోసం సిద్ధం చేస్తుంటే… వరి కొంటారా? లేదా? వరి వేస్తే.. ఉరి అంటూ ప్రజలను రెచ్చగొట్టి పరిస్థితితోనే ఇంత దూరం తీసుకొచ్చారని మంత్రి మండిపడ్డారు. దీనిపై కేంద్ర, రాష్ట్రంలోని బిజెపి నాయకులు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బండి సంజయ్ రాష్ట్ర రైతులను పూర్తిగా డోలాయమనంలో పడేశారన్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం తెలియని అజ్ఞాని… బండి అని ఆయన విమర్శించారు. బాయిల్ రైస్‌పై ఇప్పటికైనా కేంద్రం క్లారీటి ఇవ్వాలని మంత్రి జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరి పెట్టాలా… వద్దా? పెడితే ఏ రకం పెట్టాలో కేంద్రం చెప్పాలన్నారు. ఇప్పటికైనా రైతుల గురించి కేంద్రం ఆలోచించాలన్నారు.

సూటిగా రైతాంగం తరపును అడుగు తున్నానని… ధాన్యం కొనుగోలు తేల్చాల్సింది ఇప్పుడేకానీ ఫిబ్రవరిలో కాదన్నారు.
ఈ సమస్యను సృష్టించింది రాష్ట్ర బిజెపి నేతలేనని మంత్రి మండిపడ్డారు. ఈ సమస్యకు కూడా వారే పరిష్కారం చెబితే బాగుంటుం దన్నారు. రైతులను ఎటు కాకుండా…. అయోమయంలోకి నేతలు నెట్టివేశారన్నారు. ఇప్పటికైనా కేంద్రం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కు దమ్ము ఉంటే కేంద్రంతో కొట్లాడాలే కానీ విద్వేశాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడొద్దిని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో వరిధాన్యంపై రెండు నెలలుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు.

కేంద్రం వైఖరికి నిరసనగానే సిఎం కెసిఆర్ ఇటీవల మహాధర్నా ద్వారా కేంద్రాన్ని నిలదీశారన్నారు. రాష్ట్రంలో రైతులు ఏ వరి నారుపోయాలన్న అంశంపై ఇది ముందు చెప్పాలన్నారు. దేశ ప్రజల ,రైతుల ప్రాణాలు అంటే కేంద్రంలోని బిజెపికి లెక్కలేదని విమర్శించారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అలా కాదని…రైతులను గుండెల్లో పెట్టుకుని తీసుకుంటుందన్నారు. అందుకే వారి కోసం కేంద్రంపై కొట్లాటకైనా సిధ్దమేనని కెసిఆర్ చేసిన సవాల్‌ను ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి గుర్తు చేశారు. వందలాది మంది రైతులను చంపి ఒక్క క్షమాపణతో సరిపెడదామనుకుంటున్నారా? అని ఆయన నిలదీశారు. వ్యవసాయం గురించి ఆయన కనీస జ్ఞానంలేకనే ఇదంతా మాట్లాడుతున్నాడని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాట్లాడితే ఫామ్ హౌస్ అంటావు…. ఫార్మర్ హౌజ్ ……ఫార్మ్ హౌజ్ అవుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఫార్మరన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మాత్రమే రైతులకు రైతు బంధు ,రైతుబీమా ఇస్తున్నామన్నారు. ఈ దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. అలాగే 6వేల ధాన్యపు సేకరణ కేంద్రాలున్నాయా? అని కూడా కేవలం తెలంగాణలో మాత్రమే ఉన్నాయన్నారు. ఇక నుండి బండి సంజయ్ ఇష్టమచ్చినట్టు మాట్లాడుతామంటే ఇక కుదరదన్నారు. పరిణాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News