Friday, December 20, 2024

ప్రతిదానికి ఎపి ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోంది: మంత్రి జగదీశ్

- Advertisement -
- Advertisement -

Minister jagadish reddy fires on AP Govt

హైదరాబాద్: సాగర్ నీటి వినియోగంపై కృష్ణాబోర్డుకు ఎపి ఫిర్యాదుపై మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంబద్ధ ఆరోపణలతో ఎపి తన గౌరవం దిగజార్చుకుంటుందని జగదీశ్ రెడ్డి అన్నారు. సాగర్ నుంచి విద్యుదుత్పత్తికి నీటిని తెలంగాణ వాడట్లేదని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి సాగర్ నుంచి ఎక్కువగా తాగునీటి అవసరాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. పవర్ గ్రిడ్ కోసం ఐదుపది నిమిషాలు వాడుతుంటారని జగదీశ్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం నుంచి తెలంగాణ ఉత్పత్తి ఆపినా ఎపి ఇప్పటికీ చేస్తోందన్నారు. మేమెప్పుడూ ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదని ఆయన వెల్లడించారు. ప్రతిదానికి ఎపి ప్రబుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News