Wednesday, January 22, 2025

కెసిఆర్ కు పిండం పెడతానంటవా?: రేవంత్ పై జగదీశ్ రెడ్డి ఫైర్..

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నాడని,
కేసీఆర్ కు పిండం. తద్దినం పెట్టడం గురించి మాట్లాడుతున్నాడని, కేసీఆర్ కు ఎందుకు పిండం పెడుతావ్.. పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకా మంత్రి గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… “తన ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణకు ప్రాణం పోసినందుకు కేసీఆర్ కు పిండం పెట్టాలనుకుంటున్నావా?..ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినందుకు కేసీఆర్ కు పిండం పెడతావా?, రేవంత్ పిండం పెట్టాలనుకుంటున్నది కేసీఆర్ కు కాదు..తెలంగాణకు.

మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావుకు సరైన అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడు. ఎక్కడా దిక్కు లేక రేవంత్ ను పిసిసి అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. చీమలు పెట్టిన పుట్టలో పాముగా చేరాడు రేవంత్. రూ.50 లక్షల లంచం డబ్బుతో దొరికి టీడీపీకి తద్దినం పెట్టినవ్.కరెంటు తో పిచ్చి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కు తద్దినం పెట్టినావు. కేసీఆర్ గనుక రాజకీయ కక్ష ప్రదర్శిస్తే రేవంత్ వాడుతున్న భాష కు రోడ్ల మీద తిరిగేవాడా. రేపటి రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్ కు భంగపాటు తప్పదు. ప్రజలను చంపడం, సంపాదించుకొవడమే మీకు అలవాటు. చరిత్రను నిర్మించిన కేసీఆర్ ను పట్టుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతావా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సరిగా మాట్లాడటం నేర్చుకో. ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు కేసీఆర్ గురించి ఏం మాట్లాడారో తెలుసుకో. కేసీఆర్ గురించి రేవంత్ లాంటి క్షుద్ర రాజకీయాలు చేసే వారికి ఏం తెలుస్తుంది. కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి రేవంత్ క్షమాపణ చెబితే మంచిది.

రాహుల్ వాడిన చిన్న మాటకే కోర్టు శిక్ష వేసింది. అంత కన్నా ఎన్నో రెట్లు పరుష పదజాలం వాడుతున్న రేవంత్ పదవి పోవడానికి నిమిషం సమయం చాలు. కేసీఆర్ ఎవరి మీద కక్ష గట్టరు కనుక రేవంత్ కు రాహుల్ లా శిక్ష పడటం లేదు. జగన్ కే కాదు చంద్రబాబుకు కూడా ప్రగతి భవన్ లో ఆతిధ్యం ఇచ్చాము. తెలంగాణ వచ్చాక మాకు ఎవరితో శత్రుత్వం లేదు. గద్దర్ గురించి అజ్ఞాని రేవంత్ కు ఏం తెలుసు. గద్దర్ జీవితం ఎవరికి వ్యతిరేకంగా మొదలైంది తెలుసా. గద్ధర్ కు ఫలానా వారే నివాళుర్పించాలని ఎక్కడైనా ఉందా.గద్దర్ మాతో కలిసి పని చేశారు. గద్దర్ ను అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేస్తోంది వాళ్ళే మేము కాదు. గద్దర్ గురించి మాట్లాడే అర్హత మాకే ఉంది. గద్దర్ ఆశయాలను చాలా నెరవేర్చాం..పూర్తిగా సాకారం చేస్తాం. గద్దర్ గురించి రేవంత్ మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది. రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే” అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News