Sunday, January 19, 2025

అధైర్య పడకు.. అండగా ఉంటా: మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: పెళ్లి చేసుకున్న సంతోషం మూణాళ్లు కూడా లేదు..ముచ్చట తీరకుండానే రోడ్డు ప్రమాదానికి గురై వెన్నుపూసతో పాటు రెండు కాళ్ళను కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు ఆ యువకుడు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. ఆర్థిక సమస్యలకు తోడు మానసిక సమస్యలుతో నా జీవితం ఇక ఇంతే అని తీవ్ర నిరాశ నిస్పృహలలో మంచనికే పరిమితం అయిన యువకుడికి నేనున్నానంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి భరోసా కల్పించారు. అధైర్య పడకు..అండగా ఉంటా అని మంత్రి హామినిచ్చి యువకుడి జీవితంలో ఉత్సాహం నింపారు.

వివరాల్లోకి వెళితే.. చర్చి కాంపౌండ్ కు చెందిన మొండి కత్తి వినీత్ వయసు 26 ఏళ్ళు. చిన్నతనంలొనే తండ్రిని కోల్పోయి కంప్యూటర్ ఆపరేటర్ గా పని చెస్తూ తల్లిని చూసుకునే వాడు. వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి తల్లీ, భార్యలను మంచిగా చూసుకోవాలని కన్న కలలు ఆదిలొనే పటాపంచలు అయ్యాయి. వివాహం చేసుకున్న కొద్దీ రోజుల్లోనే విధి యాక్సిడెంట్ రూపంలో వక్రీకరించడంతో స్పైనల్ కార్డ్ దెబ్బతిని రెండు కాళ్ళు కోల్పోయి మంచానికే పరిమితం అయ్యాడు. భర్త పరిస్థితిని చూసిన నవ వధువు తన దారి తాను చూసుకుంది. దీంతో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఖరీదైన వైద్యం చేపించు కోలేక మంచంపైనే జీవితాన్ని వెళ్లదీస్తున్న వినీత్ ను నిన్న పక్క ఇంట్లో కల్యాణ లక్ష్మీ చెక్ లను అందజేయడానికి వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి గమనించారు. స్థానిక నాయకుల ద్వారా మొత్తం విషయంలో తెలుసుకున్న మంత్రి, భవిష్యత్ ఉన్న యువకుడు మంచానికి పరిమితం అవడాన్ని చూసి చలించిపోయారు. వెంటనే అక్కడికక్కడే నిమ్స్ వైద్యులతో మాట్లాడి వెన్నుపూస ఆపరేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని మంత్రి ఇచ్చిన భరోసా యువకుడిలో నూతన ఉత్తేజం, ఉత్సాహంను నింపింది. అతి త్వరలో వినీత్ కు నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగనుంది.

Minister Jagadish Reddy helps young man treatment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News