Sunday, January 19, 2025

తెలంగాణలో ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే కెసిఆర్ సంకల్పం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాల అభ్యున్నతే సిఎం కేసీఆర్ లక్ష్యమని, తెలంగాణలో ప్రతి వర్గం కులం భాగుపడలనేదే కేసీఆర్ సంకల్పం అన్నారు. సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం పెద్ద గట్టు లింగమంతుల స్వామి జాతర సందర్బంగా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన యాదవ సొదరులకు సంప్రదాయ దుస్తులు, 150 భేరీలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అన్ని సంస్కృతులు,సాంప్రదాయాలకు గౌరవం లభించేది దేశం లో ఒక్కతెలంగాణ రాష్ట్రం లోనే అని అన్నారు.2014 కు ముందు పెద్ద గట్టు ను యే పాలకులు పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ఇప్పటి వరకూ 15 కోట్ల రూపాయల తో గట్టు పై శాశ్వత నిర్మాణాలు చేపట్టామన్నారు.

సూర్యాపేటకు తలమానికంగా ఉన్న పెద్ద గట్టు జాతర సందర్భంలోనే కాకుండా, నిత్య భక్తులు తాకిడి ఎక్కువైందని వారి కోసమే శాశ్వత మంచి నీటి టాంక్,గెస్ట్ హౌజ్, పూజారి నివాసం, కోనేరు నిర్మాణం, మహిళ కోసం గదుల వంటి నిర్మాణాల ను చేపట్టామన్నారు. గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజా సంక్షేమమే మా ధ్యేయమన్న మంత్రి తెలంగాణలో సబ్బండ వర్ణాలకు జరుగుతున్న అభివృద్ధిని చూసే కేసీఆర్ పాలన కోసం దేశ వ్యాప్తంగా ప్రజలుఎదురు చూస్తున్నారని అన్నారు. సందర్భం ఎప్పుడు వచ్చినా యాదవ సమాజం మొత్తం కేసీఆర్ కు , బీఆరెస్ కు అండగా నిలవాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. గట్టు అభివృద్ధికి ఆకర్షితుడై కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన మాజీ చైర్మన్ గత ప్రభుత్వ హయాంలో ఏనాడూ లేని విధంగా సూర్యాపేటశాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పెద్ద గట్టు అభివృద్ది కి చేస్తున్న కృషి ఆకర్షితుడైన గట్టు మాజీ ఛైర్మెన్ మద్ధి శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.

గత పాలకులు ఎవరూ గట్టు అభివృద్ధిని పట్టించుకోలేదన్న శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి సూర్యాపేటకు వచ్చాకే పెద్ద గట్టు అభివృద్ధి చెందిదన్నారు. అభివృద్ధికి మద్దతుగా తాను కాంగ్రెస్ ను వీడానుఅని అన్నారు. కాంగ్రెస్, బిజెపి లతో నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీల లో ఉన్న నేతలు ఆత్మ విమర్శ చేసుకుని బీఆర్ఎస్ లో చేరాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు. కార్యక్రమంలో పెద్ద గట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, డీసీఎం ఎస్ చైర్మన్ వట్టే జనయ్య యాదవ్,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గొపగాని వెంకట్ నారాయణ గౌడ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ ఎస్ రాష్ట కార్యదర్శి వై. వీ,పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మది బిక్షం, సూర్యాపేట ఎంపిపి రవీందర్ రెడ్డి , జడ్పీటిసి లు జీడి బిక్షం, సంజీవ నాయక్, అనిత అంజయ్య , సింగిల్ విండో చైర్మన్లు , మండల అధ్యక్షులు, సర్పంచ్ లు , ఎంపిటిసి లు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News