Monday, December 23, 2024

నూతన బస్‌స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో బుధవారం నూతన బస్ స్టేషన్ ను మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొండకు దిగువన గండి చెరువు సమీపంలో యాదాద్రి బస్ స్టేషన్ ను నిర్మించారు. ప్రస్తుతం బస్టాండ్ పనులు పూర్తి కావడంతో భక్తులకు అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 ఎకరాల్లో రూ. 6. 90కోట్లతో యాదాద్రీశుడి ఆలయానికి తగినట్లుగా గండిచెరువు సమీపంలో ఈ బస్టాండ్ను ఆధ్యాత్మిక హంగులతో నిర్మాణం చేశారు. 10 ప్లాట్ ఫామ్ తో ఏర్పాటు చేసిన బస్టాండ్ లో 2. ప్లాట్ ఫామ్లు కొండపైకి వెళ్లే బస్సుల కోసం కేటాయించామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News