Thursday, December 26, 2024

ఓటమే గెలుపుకు బాట : మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యపేట: క్రీడలలో ఓటమిని ముందు గెలుపు కోసం స్ఫూర్తిగా తీసుకొవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బాలెంల గ్రామంలో మున్నూరు కాపు సంఘము ఆధ్వర్యంలో మాజీ కబడ్డీ క్రీడాకారులు స్వర్గీయ రామసాని సుధాకర్ స్మారక అండర్ 17 కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “జీవితమే ఒక ఆట…ఓటమే గెలుపుకు బాట” అన్నారు. యువతలో చైతన్యం, ఉత్సాహం తెచ్చే సందేశాన్ని ఇస్తూ ,ఓటమి చెందానని కుంగిపోవద్దనీ,గెలుపు కోసం ప్రయత్నాలు అపొద్దనీ సూచించారు. సహనం ఉంటే విజయం నీ సొంతమని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలనీ పిలుపు నిచ్చారు.

గ్రామీణ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందనీ మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్ వట్టే జానయ్య యాదవ్, జెడ్పిటిసి జీడి బిక్షం, పెన్ పహడు ఎంపీపీ నెమ్మది బిక్షం, మున్నూరు కాపు మహాసభ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి రమేష్, జిల్లా యూత్ అధ్యక్షులు నల్లగుంట్ల సందీప్, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు డేగల రమేష్ నాయుడు, బాలెంల సర్పంచ్ రామసాని రమేష్ నాయుడు, సూర్యాపేట వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు తదితరులుపాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News