Sunday, January 19, 2025

విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి జగదీశ్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నార్కట్‌పల్లి : దేశంలో విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11కెవి సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ముందు రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ప్రస్తుతం పరిస్థితి బేరీజు వేసుకుంటే రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి విద్యుత్ రంగంలో ఆరున్నర వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే మూడున్నర వేల మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం 15 వేల మెగా ఉత్పత్తి సామర్థ్యంతో 5 రెట్లు అధికంగా రాష్ట్రంలో అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రంలో రైతాంగానికి కేవలం 6 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరగుతోందని అది కూడా మోటార్‌లకు మీటర్ పెట్టూ బిల్డింగ్‌తో జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బావి దగ్గర మోటార్‌లు పెట్టను అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారని మంత్రి గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కలకతా,బెంగూళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలల్లో విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి పేర్కొన్నారు.

రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10 వేల రూపాయలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. రైతు చనిపోతే రైతు భీమా కింద 5 లక్షల రూపాయల చెక్కును వారం రోజుల్లో అందజేస్తున్న ప్రపంచంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని వర్గాలకు వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేతన కార్మికులకు, బోధకాలు వ్యాధి గ్రస్తులకు, కిడ్ని, వ్యాధి గ్రస్తులు డయాలసిస్ చేసుకుంటున్న రోగులకు కూడా పెన్షన్లు అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 51 లక్షలు కొత్త విద్యుత్ కనెక్షన్లు వుండగా 8 సంవత్సరాలలో 37 వేల వ్యవసాయ కనెక్షన్లు అంటే కొత్తగా 13 వేల వ్యవసాయ కనెక్షన్‌లు మంజూరు చేసినట్లు తెలిపారు.

మండలంలో అన్ని కనెక్షన్లు కలిపి 92 వేల నుండి 8 సంవత్సరాలలో ఒక లక్ష 36 వేలకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్‌పి చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సైదులు, సర్పంచ్ రాజిరెడ్డి, వరమ్మ రామిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News