Monday, December 23, 2024

ఢిల్లీకి కెసిఆర్ భయం పట్టుకుంది: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Jagadish Reddy Meet The Press in Press Club

హైదరాబాద్: దేశంలో ప్రధాని మోడీ పై క్రేజ్ తగ్గిందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ పై క్రేజ్ తగ్గిందని… ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యామ్నాయ శక్తిగా మారారని తెలిపారు. సిఎం కెసిఆర్ కీర్తి దశ,దిశలు వ్యాపిస్తోందన్నారు. కమలనాధులు అభద్రతా భావంతో వణికి పోతున్నారని చెప్పారు. ఢిల్లీకి కేసీఆర్ భయం పట్టుకుందన్నారు. ఆ భయంతోటే ప్రతిపక్షాలను బలహీన పరచే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను అస్థిర పరచే కుయుక్తులు చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. టిఆర్ఎష్ ను నిలువరించే కుట్రలో భాగమే ఉపఎన్నిక. తెలంగాణ సంక్షేమ పథకాలు సరిహద్దు రాష్ట్రాలను దాటాయని చెప్పారు. పథకాల చర్చ గుజరాత్ లోనూ మొదలైందని మంత్రి పేర్కొన్నారు.

కుటుంబ స్వార్థం కోసమే రాజగోపాల్ రాజీనామా చేశారని ఆరోపించారు. బిజెపి ఎత్తుగడలో ఆయన ఒక పావు, మునుగోడుకు కొత్తగా వచ్చింది అమిత్ షా,నడ్డా లే అన్నారు. ఉద్యమ కాలం నుండే ముఖ్యమంత్రి కేసీఆర్ కు మునుగోడు సుపరిచితమేనని ఆయన సూచించారు. వరద కాలువలే ఫ్లోరోసిస్ కు శాశ్వత పరిష్కారం చూపించారని తెలిపారు. ఆరు ఏండ్లలో ఫ్లోరోసిస్ ను పారద్రోలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ సమాజం కోవర్ట్ రాజకీయాలను కోరుకోవడం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో బిజెపిని నిలువరించాలన్నదే వామపక్షాల అభిమతమని వివరించారు. మునుగోడులో మద్దతు అందులో భాగమేనన్నారు. మునుగోడులో రెండోస్థానం కోసమే కాంగ్రెస్ ,బిజెపి లు పోటీ పడుతున్నాయి. ప్రలోభాలు బిజెపి పుణ్యమే. బిజెపికి అక్కడ లీడర్, క్యాడర్ నిల్ అన్నారు. అందుకోసమే ఈ ప్రలోభాలని చెప్పారు. కూసుకుంట్ల ఎన్నిక లాంఛనమే అని మంత్రి పేర్కొన్నారు. సాదారణ ఎన్నికలపై మునుగోడు ఫలితం ప్రభావం చూపుతుందన్న ఆయన ఎన్నికల ఫలితాలే పనితనానికి గీటు రాయన్నారు. అడ్డంకులు ఎదురైన సమస్యలను పరిష్కరిస్తాం. ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మునుగోడు లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని మీట్ ది ప్రెస్ లో మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News