Wednesday, January 22, 2025

కాంగ్రెస్ హామీలు బోగస్: జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తుక్కుగూడ సభ లో కాంగ్రెస్ హామీల పై  మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలను మోసగించడం కాంగ్రెస్ అలవాటని, కాంగ్రెస్ చరిత్ర ఎప్పుడూ ప్రజల వైపు లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ కు లేదన్నారు. దేశంలో ఆకలి దారిద్ర్యాలకు కారణం కాంగ్రెస్ పార్టీనేనని, అబద్ధాపు హామీలు ఇచ్చే అలవాటు లేని  సిఎం కెసిఆర్ కు లేదని,అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఇచ్చిన హామీలు భఫూన్,

బుడ్డర్ ఖాన్ లను తలపించేలా ఉన్నాయన్నారు.ఒక్కటి అంటే ఒక్కటి కూడా అమలు చేయగలిగినవి లేవని, కాంగ్రెస్ వాళ్లు ఏలుతున్న ఏ ఒక్క రాష్ట్రం లో కూడా నిన్న ప్రకటించిన పథకాలు లేవని, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించాలని కాంగ్రెస్ చూస్తుందన్నారు. చైతన్య వంతులైన తెలంగాణ ప్రజల ముందు కాంగ్రెస్ పాచికలు పారవని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామ రక్ష మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News