Sunday, January 19, 2025

మోడీ ప్రభుత్వ తిరోగమనానికి నోట్ల రద్దు పరాకాష్ట:జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట  : నోట్ల రద్దుతో కేంద్రంలో మోడీ పాలనకు తిరోగమనం మొదలైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇది దేశాభివృద్ధికి ఎంతమాత్రం దోహద పడదని తేల్చి చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశంలో నోట్ల రద్దు పై స్పందించారు. ఆర్థికంగా దేశాన్ని దెబ్బతీసే కుట్రలో మోడీ సర్కార్ పన్నిన పన్నాగమే నోట్ల రద్దు చర్యగా ఆయన అభివర్ణించారు. పెట్టుబడి దారుల రహస్య ఎజెండాను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు పరుస్తుందని అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా ఆయన చెప్పుకొచ్చారు. అసలు 2000 నోట్లను ఎందుకు తెచ్చారో, రద్దు చేశారో అన్నది దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపయోగం లేదనుకున్నప్పుడు ఎందుకు తీసుకువచ్చారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఏమి ఆశించి ఈ చర్యకు ఉపక్రమించారు అని సర్వత్రా వెలువడుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మోడీ సర్కార్‌పై ఉందన్నారు. నోట్ల రద్దు వెనుక ఉన్న బిజెపి రహస్య ఎజెండాను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రయోజనం ఉందని భావిస్తే బహిరంగరపచడానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తేల్చి చెప్పాలన్నారు. ఆర్బిఐని ముందు పెట్టి ప్రజల కళ్లు కప్పే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆయన మోడీ సర్కార్ పై మండి పడ్డారు. దేశంలో బిజెపి ప్రభుత్వం పతనావస్తకు చేరుకుందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News