Monday, December 23, 2024

పెద్దగట్టు జాతరకు సర్వం సిద్ధం: మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: దేశం లోనే రెండవ అతిపెద్ద జతరత్ గా పేరొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 5 వ తేదీ వ నుండి 9వరకు జరిగే జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

6కోట్ల 50 లక్షలు నిధులను జాతర ఏర్పాట్ల కోసం కేటాయించామని తెలిపిన మంత్రి, జాతర కు వచ్చే భక్తులు, స్నానాలు ఆచరించే కోనేరు, మంచి నీటి టాంక్, పార్కింగ్ ప్రదేశాలను మంత్రి పరిశీలించారు. ఆసియా లోనే అతి పెద్ద జాతర గా పేరొందిన దురాజ్ పల్లి పెద్ద గట్టు జాతర కు 10 నుండి 15 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా తో ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News