Sunday, January 19, 2025

కేంద్రం పై మంత్రి జగదీష్ రెడ్డి మండి పాటు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : ఐటి దాడులు బిజెపి ప్రభుత్వ ప్రేరేపితమే నని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్ని దాడులు చేసినా తాము ప్రజల పక్షమే నన్నారు. దాడులతో ప్రతిపక్షాలను అణిచివేయ్యాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందని బుధవారం నాడొక ప్రకటనలో పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నేతలది తెరిచిన పుస్తకమని అంటూ పార్టీలోకి రాక ముందే వారికి వ్యాపారాలు ఉన్నాయన్నారు. వారి వారి వ్యాపారాలన్నీ వైట్ పేపర్లే నన్నారు. లెక్క ప్రకారమే పన్నులు చెల్లిస్తున్నారని ఆయన చెప్పారు. విచారణ సంస్థలను అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News