Wednesday, January 22, 2025

రేపు చిట్యాలకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి రాక

- Advertisement -
- Advertisement -

చిట్యాల : మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు గాను శంఖుస్దాపనకు గురువారం పట్టణానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి విచ్చేయుచున్నారని మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. స్దానిక భువనగిరి రోడ్డులో ( శ్రీ వెంకటేశ్వర కాలనీకి వేళ్లే దారి ప్రక్కన) అభివృద్ది పనులకు శంఖుస్దాపన చేస్తారని అన్నారు.

అనంతరం స్దానిక లక్షి గార్డెన్స్‌లో బహిరంగ సభను నిర్వహించటం జరుగుతుందని వివిధ హోదాల్లో వున్న ప్రజా ప్రతినిధులు , మాజీ ప్రతినిధులు, టిఆర్‌ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో వున్న నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు. మార్కెట్ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి, మెండె సైదులు, ముబీన్, భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News