- Advertisement -
మనతెలంగాణ /అర్వపల్లి : హోదా కంటే భాధ్యత గుర్తెరిగి మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమాజానికి భాధ్యత గుర్తుచేస్తూ తన తండ్రితో కలిసి వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి. నాగారం మండలంలోని డి. కొత్తపల్లి శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో మండుటెండలో తండ్రి రామచంద్రయ్యతో కలిసి వ్యవసాయ క్షేత్రం కలియతిరిగారు. ఆ సమయంలో ఎండ ఎక్కువగా ఉండడంతో తన తండ్రిపై ప్రేమతో తనతండ్రికి నీడనిస్తు గొడుగును పట్టి తన వ్యవసాయ భూమిని పరీశీలించారు. తండ్రికి గొడుగు పట్టిన తీరును చూసి అందరూ విస్మయానికి గురి అయ్యారు. డీల్లికి రాజుఅయిన తల్లితండ్రికి కొడుకే అనే సామేతను మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్థకం చేసుకున్నారని ప్రజలు అధికారులు అనుకుంటున్నారు.
- Advertisement -