Monday, December 23, 2024

ఉద్యమనేతకు మంత్రి జగదీష్‌రెడ్డి కన్నీటి నివాళి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతో కీలకపాత్ర పోషించిన పగడాల కృష్ణారెడ్డి మృతి బీఆర్‌ఎస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆత్మకూర్‌ఎస్ మ ండలం బొప్పారంకు చెందిన కృష్ణారెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలై చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.

ఆయన మృతదేహంపై మంత్రి జగదీష్‌రెడ్డి పూలమాలలు వేసికన్నీటి నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదంలో కృష్ణారెడ్డికి గాయాలైన విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి చే రుకోని పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తలకు బలమైన గాయాలు అయ్యాయని చెప్పడంతో అ త్యవసర వైద్యం కోసం హైద్రాబాద్‌కు తరలించారు. కృష్ణారెడ్డిని బతికించేందుకు మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కృష్ణారెడ్డి జ్ఞాపకాలను గుర్తు చేసూకుంటు కన్నీంటి పర్యా ంతం అయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానిటికి అండగా ఉంటానని హామి ఇ చ్చారు. నివాళులర్పించిన వారిలో ఎమ్మెల్యేలు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్‌రావు, రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, జ డ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, ఎంపిపి స్వర్ణలతచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కోణతం సత్యనారాయణరెడ్డి, నాయకులు కసగాని బ్రహ్మం, బత్తుల ప్రసాద్, వాంకుడోతు వెంకన్న నాయక్, ప్రజాప్రతినిధు లు,నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News