Monday, December 23, 2024

ఎన్నారైల తీరు గర్వకారణం

- Advertisement -
- Advertisement -

ఇండోర్ : ప్రవాస భారతీయుల పనితీరు అద్భుతం అని విదేశాంగ మంత్రి జైశంకర్ కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కులా భారతీయులు ఉన్నారు. వీరు తమ వృత్తిధర్మం పాటిస్తూనే దేశం కోసం పరితపిస్తున్నారని జైశంకర్ తెలిపారు. భారతీయ సంతతికి చెందినవారు అత్యంత ప్రతిభావంతులని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన యువజన ప్రవాసీ భారతీయ దివస్ సభలో ఆదివారం మంత్రి మాట్లాడారు. విదేశాలలో నివసిస్తున్న భారతీయ సామాజిక వర్గానికి విశిష్టత ఉందని, ఇప్పుడు జరుగుతోన్న ఈ తరహా ప్రవాసీ భారతీయ దినోత్సవాలతో వారి పట్ల మనకున్న భారతీయ బంధం, వారికి భారత్‌కు ఉన్న అనుబంధం మరింత పటిష్టం అవుతుందని జైశంకర్ తెలిపారు.

ఇతరదేశాల వారితో పోలిస్తే భారతీయులు అత్యధిక సంఖ్యలో విదేశాలలో ఉన్నారు. పైగా ప్రతిభావంతులు అని ఎన్నారైలు భారత్‌కు మిగిలిన ప్రపంచానికి మధ్య వారధులుగా మారారని తెలిపారు. పలు దేశాల నుంచి యువజన ప్రతినిధులు ఈ సభలకు తరలివచ్చారు. మూడు రోజుల పాటు ఇండోర్‌లో ఈ సభలు జరుగుతాయి. సభలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆస్ట్రేలియా పార్లమెంటేరియన్ జనేటా మస్కరేన్హస్ హాజరయ్యారు. మన సంతతివారు ఈ భారత అమృతకాలంలో భారతీయ ప్రగతి దిశలో విశ్వసనీయ భాగస్వాములు అనే ఇతివృత్తంతో ఈ 17వ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సదస్సు చేపట్టారు. ఇండోర్‌లో జరిగే ఈ ప్రవాసీ దివస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హాజరయి ఉపన్యసిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News