Monday, December 23, 2024

180 ఎకరాల భూములను కొట్టేసిన మంత్రి జయరామ్: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: 180 ఎకరాల ఇటినా భూములను బెంజ్ మంత్రి జయరామ్ కాజేశారని టిడిపి యువ నేత లోకేష్ ఆరోపణలు చేశారు. మంత్ర గుమ్మనూరు జయరామ్ అవినీతి చిట్టాతో పాటు ల్యాండ్ స్కామ్‌కు సంబంధించిన ఆధారాలను లోకేష్ బయటపెట్టారు, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి, భూములు కొట్టేసిన వైనంపై ఆధారాలు బయటపెట్టారు. పాదయాత్రలో భాగంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. కమర్షియల్ భూమిని, వ్యవసాయ భూమిగా తన కుటుంబం పేరున మంత్రి జయరామ్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపణలు చేశారు. 45 కోట్ల విలువైన భూమిని రెండు కోట్ల ప్రభుత్వ వాల్యూ చూపి కారు చౌకగా మంత్రి జయరామ్ అనే ఘనుడు కొట్టేశారని ధ్వజమెత్తారు.

Also Read: సింగరేణి పరిస్థితి దయనీయంగా ఉంది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

వ్యవసాయంలో లాభం వచ్చిందని, మరి ప్రభుత్వం నుంచి ఎందుకు నష్ట పరిహారం తీసుకున్నారని ప్రశ్నించారు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి భూములు కొన్నారని, మీకు భూములు అమ్మిన మంజునాథ్ సేల్ డీడ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడని అడిగారు. ఆ భూములు అమ్మే హక్కు అతనికి లేదు కాబట్టి సేల్ డీడ్ రద్దు చేసుకున్నారని, ఐటి బినామీ యాక్ట్ ప్రకారం బెంజ్ మంత్రి జయరామ్ దొరికిపోయారన్నారు. కుటుంబ భూముల ఆదాయంతోనే ఇటినా భూములు మంత్రి కొన్నానంటున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. కుటుంబ భూముల గురించి ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ధర ప్రకారం ఎవరైనా ముందుకు వస్తే రైతులకు భూములు వెనక్కి ఇస్తామని మంత్రి ఇప్పుడు మాట ఎందుకు మార్చారాని నిలదీశారు. ఐటి డిపార్ట్‌మెంట్‌కి అడ్డంగా దొరికిపోయి నీతులు మాట్లాడటం బెంజ్ మంత్రికే చెల్లిందని చురకలంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News