Monday, January 20, 2025

నేడు మంత్రి జూపల్లి కామారెడ్డి, నిజామాబాద్ పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రజాపాలన తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పర్యాటక, సంస్కృతి పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం కామారెడ్డి , నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం, జగ్గనాథపల్లి గ్రామానికి చేరుకుని అక్కడి కొవ్లాస్ కోటను సందర్శిస్తారు. అనంతరం 10:30 కు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామం చేరుకుని ప్రజాపాలన కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 11:00 గంటలకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలోనూ ప్రజాపాలనలో పాల్గొంటారు. మధ్యాహ్నం బాన్సువాడ పట్టణానికి చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News