Wednesday, January 22, 2025

ప్రతి పైసాకు వారు లెక్క చెప్పాల్సిందే…

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని, ఎవరూ ముందుకు రావడం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని, ఆ పార్టీని వీడుతున్నారన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీలో కెసిఆర్ కుటుంబం తప్ప ఒక్కరు కూడా మిగలరని ఆయన విమర్శించారు. మరోవైపు మిషన్ భగీరథ పథకంలో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ప్రతి పైసాకు వారు లెక్క చేప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్ అనేక హామీలు ఇచ్చిందని అందులో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందనందుకే ప్రజలు బిఆర్‌ఎస్‌ను ఓడించారన్నారు. గతంలో ప్రతిపక్షాలు బిఆర్‌ఎస్‌ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే రెండేళ్ల పసికందును విమర్శిస్తారా? అని వాపోయినట్లు ఆయన గుర్తుచేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News