Tuesday, September 17, 2024

వీలైనంత త్వరగా పంప్ హౌస్ ను పునరుద్ధరించాలి:మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వయర్ పంపుహౌస్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపాల్లి కృష్ణారావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.నీట మునిగిన పంప్ హౌజ్ ను మంత్రి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి బుధవారం నాడు పరిశీలించారు. పంపులు నీటమునిగి పోవడానికి గల కారణాలు, వాటి సామర్థ్యం, సర్వీస్, నిర్వహణ తదితర విషయాలపై మంత్రి ఆరాతీశారు.

ఆడిట్ టన్నెల్ ద్వారా సొరంగ మార్గంలోకి వస్తున్న వరదకు అడ్డుకట్ట వేశామని అధుకారులు మంత్రికి వివరించారు. ప్రవాహం పూర్తిగా ఆగిన వెంటనే టన్నెళ్ల వద్ద మోటార్లు ఏర్పాటు చేసి సొరంగ మార్గంలో నిలిచిన నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడి వేయాలని ఆదేశించారు. నీట మునిగిన పంప్ హౌస్ మోటార్లను పునరుద్ధరణ చేసి యధావిధి స్థితికి తేవాలని దిశానిర్ధేశం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News