Wednesday, January 22, 2025

కెటిఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్..

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ రాజకీయ హత్యలకు తెరలేపిందని తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ప్రతిష్టను తానే దిగజార్చుకునేలా కెటిఆర్ మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. వ్యక్తిగత కక్ష్యలతో హత్య జరిగితే.. దానిని కెటిఆర్ రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏనాడు రాజకీయ హత్యలకు పాల్పడలేదన్నారు. ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. కెటిఆర్ మాటలు ఆయన స్థాయినే తక్కువ చేస్తాయని చెప్పారు. గత ప్రభుత్వంలో లూఠి చేసిన ప్రతీ పైసను ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామి మంత్రి జూపల్లి అన్నారు.

ఆదివారం నాగర్ కర్నూజిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న దారుణ హత్యకు గురైన బిఆర్‌ఎస్ కార్యకర్త, రిటైర్డ్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ కుటుంబాన్ని కెటిఆర్ పరామర్శించారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు ప్రారంభమయ్యాయని.. తమ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News