Thursday, January 9, 2025

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కెసిఆర్‌దే:మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లులోని శ్రీలక్ష్మీగార్డెన్‌లో బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..పదేళ్లు పాలన చేసిన బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వంపై బురద జల్లడం సిగ్గుచేటని మండిపడ్డారు. కెసిఆర్ తెలంగాణపై రూ.8 లక్షల కోట్లు అప్పులు మోపారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.67 వేల కోట్ల అప్పులు కటిందన్నారు.

గతంలో కెసిఆర్ రూ.3 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. రైతులకు రైతుభరోసా ఎకరానికి రూ.10 వేలు త్వరలో ఇస్తామన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కల్వకుర్తి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఎలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, సిడబ్లుసి ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, పిసిబి మెంబర్ బాలాజీసింగ్, పిసిసి సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాట గీత నర్సింహ, వైస్‌ఛైర్మన్ గూడూరు బాస్కర్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News