Sunday, December 22, 2024

మానవత్వాన్ని చాటిన మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మానవత్వాన్ని చాటారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న సమయంలో షాద్‌నగర్ రాయికల్ టోల్ గేట్ సమీపంలో ఓ వ్యక్తి ఫిట్స్ వచ్చి కొట్టు మిట్టాడుతూ అల్లాడుతున్న ఘటన కంట పడింది. వెంటనే తన కాన్వాయిని ఆపి రోగి వద్దకు వెళ్లి చేతిలో ఇనుప వస్తువులు అందించి సపర్యలు చేశారు. వెంటనే ఆంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి రోగిని దగ్గరుండి మరి ఆస్పత్రికి తరలించడంతో పాటు వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మంత్రి తన కాన్వాయిని ఆపి మరీ మూర్ఛ రోగిని ఆస్పత్రికి తరలించి మావవతా ధృక్పథాన్ని చాటడం పట్ల వాహనదారులు, ప్రజలు ప్రసంశలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపే మంత్రి ఇలా ఓ వ్యక్తి రోడ్డుపై ఫిట్స్‌తో కొట్టుమిట్టాడుతుండటాన్ని చూసి స్పందించి సహాయం అందించిన మానవీయ కోణాన్ని పలువురు కొనియాడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News