Wednesday, January 22, 2025

రేపు లండన్ పర్యటనకు మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 4 సోమవారం ఉదయం లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటకులను ఆకర్షించడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి జూపల్లి ఇంగ్లాండ్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా లండన్‌లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో మంత్రి పాల్గొంటారు. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ ట్రావెల్ మార్కెట్‌లో తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ను ఏర్పాటు చేయనుంది. ఆయా దేశాల పర్యాటక శాఖ మంత్రులు, విదేశీ ప్రతినిధులు, గ్లోబల్ టూరిజం బోర్డులు,

హోటళ్ల యజమానులు, ప్రయాణ, ఆతిధ్య రంగ నిపుణలతో మంత్రి జూపల్లి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పర్యాటక, ఆతిథ్య రంగంలోపెట్టుబడుల అనుకూలతల గురించి చర్చించనున్నారు. లండన్‌లోని కాసిల్ గ్రీన్‌లో నిర్వహించే తెలంగాణ పర్యాటక రోడ్ షోలోనూ మంత్రి జూపల్లి పాల్గొంటారు. లండన్ వేదికగా నవంబర్ 5 నుంచి -7 వరకు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ట్రావెట్ మార్ట్‌లో వందకు పైగా విదేశీ ప్రతినిధులు, మన దేశ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు, అధికారులు ఈ మార్ట్‌లో పాల్గొననున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News