Wednesday, January 22, 2025

కోయిల్ సాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

ఇవాళ మధ్యహ్నాం మంత్రి జూపల్లి కోయిల్ సాగర్ జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. పర్యాటకులను ఆకర్షించడమే ధ్యేయంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే జిల్లాల పర్యటన చేసి.. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని, రూ. 3 కోట్లతో సరళా సాగర్, కోయిల్ సాగర్, కురుమూర్తి ఆలయ అభివృద్ధి చేస్తామన్నారు.

గ‌త ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క అభివృద్ధి చేస్తామ‌ని చెప్పినప్ప‌టికీ  కార్యరూపం దాల్చ లేదని, సరైన మౌలిక వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డం, ప్రచారం లేక పర్యాటకులు అనుకున్న స్థాయిలో రావడం లేదన్నారు. ప్రాధాన్యతను బట్టి పర్యాటక ప్రాంతాల్లో ఉన్న కాటేజీల పునర్నిర్మాణం, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని,ప‌ర్యాట‌క అభివృద్ధి, ప్ర‌మోష‌న్ వ‌ల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి, కోయిల్ సాగర్ లో గెస్ట్ హౌస్, కాటేజీలను నిర్మిస్తామని, 2 స్పీడ్ బోట్స్, 2 మినీ బోట్స్ ను ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News