Thursday, January 23, 2025

భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టుపై సమీక్ష

- Advertisement -
- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్‌లోని భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన పనుల పురోగతిని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామమోహన్ నాయుడు ఆదివారం సమీక్షించారు. విమానాశ్రయం 2026 జూన్ నాటికి విమాన సర్వీసుల నిర్వహణకు సిద్ధం కావచ్చునని ఆశిస్తున్నారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం. రన్‌వే నిర్మాణం, ఏప్రాన్, అప్రోచ్ రోడ్లు సహా కీలక అంశాలను సమీక్షించినట్లు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. విమానాశ్రయం ప్రాజెక్టుకు సంబంధించిన పని దాదాపు 36 శాతం పూర్తి అయింది. 2026 జూన్ నాటికల్లా విమానాశ్రయం కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను నాయుడు సమీక్ష సమావేశంలో ఆదేశించినట్లు ఆ ప్రకటన తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News