Wednesday, January 22, 2025

హైదరాబాద్ నుండే రాష్ట్రానికి అధిక ఆదాయం:మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ ఆ ఆదాయాన్ని రాష్ట్ర ప్రజల అవసరాలకు ఆశించిన స్థాయిలో వినియోగించడం లేదని విమర్శించారు. ఆదివారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి హైదరాబాద్ నగరం అతి ముఖ్యమైనదని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్ స్థానం చాలా గొప్పదని కొనియాడారు. గత ఇరవై, ముప్పై ఏళ్లుగా నగరం గణనీయంగా అభివృద్ది చెందిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, విద్యా, రక్షణ, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు పురోగతిలో దూసుకుపోతున్నాయని అన్నారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక పోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని రకాల సహాయం చేయడానికి ముందుటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ఆదాయంలో 80 శాతం ఒక్క హైదరాబాద్ నగరం నుండే వస్తుందని అన్నారు. ఈ ఆదాయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే ప్రజలకు సంబంధించిన అనేక అభివృద్ధి పనులు పూర్తి చేయవచ్చునని అన్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచన చేయకుండా వారి స్వంత ప్రయోజనాలకు రాష్ట్ర ఆదాయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News