Monday, December 16, 2024

ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం

- Advertisement -
- Advertisement -

సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు అర్థమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని, కానీ అది చేయకుండా వ్యక్తిగతంగా అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో సినీ నటులను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారనేది మరోసారి నిరూపితమైందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ అరెస్టును, పాలకుల అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

అల్లు అర్జున్ అరెస్టులో పోలీసుల తీరు దారుణం: బండి సంజయ్
జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం ఈ అరెస్టును ఖండిస్తూ బట్టలు మార్చకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి నేరుగా అరెస్టు చేసి తీసికెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక జాతీయ అవార్డు గ్రహితను, ప్రముఖ హీరో పట్ల ఈ రకంగా అమర్యాదగా వ్యవహరించి అవమానించి అగౌరవపరిచిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదని అన్నారు. తన నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడు పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందని తెలిపారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరం, అయితే ఇది భారీ జనసందోహాన్ని నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే ఈ ఘటన నొక్కి చెబుతుందని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలన్నారు.

తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదు: రాజాసింగ్
తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యానించారు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించిన రాజాసింగ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషాదకరమైన తొక్కిసలాట ఘటన పోలీసు శాఖ వైఫల్యమేనని, జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ కాదని అన్నారు. అలాగే అల్లుఅర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారని తెలిపారు. ఆయన నేరుగా బాధ్యత వహించని దానికి అతనిని జవాబుదారీగా ఉంచడం అన్యాయం, అసమంజసమైనదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News