Friday, December 20, 2024

98 శాతం పూర్తయిన చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు:మంత్రి కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

నగర శివారులోని చర్లపల్లి స్టేషన్‌ను ఆధునీకరించి, విస్తరించి చేపట్టి పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్దమవుతూ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. శనివారం ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని చర్లపల్లి టెర్మినల్ ఫోటోలను కూడా విడుదల చేశారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్ కానుందని వెల్లడించారు. 9 ఫ్లాట్ ఫాంలతో అందుబాటులోకి రానుందని తెలిపారు.

లోక్ సభ ఎన్నికలకు ముందే పూర్తి కావాల్సిన ఈ రైల్వే స్టేషన్ త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని అన్నారు. రూ.434 కోట్ల బడ్జెట్‌లో ఈ స్టేషన్ ఆధునీకరణ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గుతుందని తెలిపారు. సుదూర ప్రాంత రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను మారడానికి ఎంతోమందికి ఈ స్టేషన్ మరింత అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఎయిర్ పోర్టును మైమరపించేలా రైల్వే స్టేషన్ అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News