Thursday, January 23, 2025

కాంగ్రెస్ అంటేనే అబద్దపు హామీలు..రాజకీయ మోసం:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అంటేనే అబద్దపు హామీలు, రాజకీయ మోసమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. గత పాలనలో లీకేజీలతో యువత ద్రోహానికి గురైతే, ఇప్పుడు మోసంతో నిర్లక్ష్యానికి గురయ్యారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలని శనివారం రాత్రి అశోక్ నగర్‌లో నిరుద్యోగుల ర్యాలీ చేపట్టిన దానిపై స్పందించిన ఆయన ర్యాలీకి సంబందించిన వీడియోను ట్విట్టర్‌లో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ అంటేనే అబద్దపు, అమలు కానీ హామీలు,

విఫలమైన గ్యారెంటీలు, రాజకీయ మోసం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలంగాణ యువత గత బిఆర్‌ఎస్ పాలనలో పేపర్ లీకేజీలతో ద్రోహానికి గురైతే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అబద్దపు హామీలు, వీగిపోయిన వాగ్దానాలతో మోసం చేయబడి, పూర్తిగా నిర్లక్ష్యానికి గుర్యయ్యారని అన్నారు. యువకుల ఆకాంక్షల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారి ఆందోళనలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. దీంతో యువత వారి భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి పోరాడవలసి వచ్చిందని తెలిపారు. ఇక హైదరాబాద్‌లో నిరుద్యోగ యువకుల నిరసన కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు, మోసాన్ని గుర్తు చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News