Saturday, December 21, 2024

కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్‌లో ఎప్పుడు జైలుకు వెళ్లేది తెలియదు:కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ ఫోన్ ట్యాపింగ్‌లో ఎప్పుడు జైలుకు వెళ్లేది తెలియదని ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరో చెబితే వినే రక్తం మా నల్గొండోళ్లది కాదని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల కోసం రెచ్చగొట్టగానే రెచ్చిపోవడానికి నల్లగొండ ప్రజలు అమాయకులు కాదని ఆయన అన్నారు. నల్లగొండ ప్రజలది దొరలు చెబితే వినే రక్తం కాదని ఆయన అన్నారు. మూసీ కష్టాలంటే ఏమిటో నల్లగొండ జిల్లా ప్రజలను అడిగితే చెబుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

అధికారం పోయినా కూడా బిఆర్‌ఎస్ నేతల్లో ఇంకా అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆయన మండిపడ్డారు. కెటిఆర్, హరీష్ రావులకు నల్గొండ వాళ్లంటే ఎందుకు అంత కోపమని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. “విషం పెట్టి చంపండి, లేదంటే మేమే చచ్చి పోతాం” అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కెటిఆర్, హరీష్‌రావులు మూసీ ప్రజలను రెచ్చ గొడుతున్నారని, వాళ్ల ఇంటి వద్ద ఎక్కడపడితే అక్కడ శాంతియుత పద్ధతిలో నిరసన చెబుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News