Wednesday, January 22, 2025

రేవంత్ రెడ్డి పదేళ్లు సిఎం: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

భారతీయ జనతా పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సిఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఎవరూ లేరని వివరించారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఏక్ నాథ్ షిండేలను సృష్టించిందే బిజెపి అన్నారు. హరీశ్ రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి కోరారు. బిఆర్ఎస్ కి ఒక్క ఎంపి సీటు కూడా రాదు అని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. బిఆర్ఎస్ ఒక్క సీటు గెలిస్తే… తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని సూచించారు. బండి సంజయ్ ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా? అని కోమటి రెడ్డి ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News