Sunday, December 22, 2024

వారంతా మూర్ఖులే: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

- Advertisement -
- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. 13న నల్లగొండ పట్టణ చౌరస్తాల్లో కూర్చి వేసి పింక్ టవల్ వేసి కెసిఆర్ బొమ్మ పెట్టి రైతులతో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పిన తర్వాతే కెసిఆర్ నల్లగొండకు రావాలన్నారు. నల్లగొండకు కెసిఆర్ ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు..? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలపై మాట్లాడే అర్హత కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావుకు లేవని ఆయన పేర్కొన్నారు. నల్లగొండ, దక్షిణ తెలంగాణను ఎడారి చేసింది.. కెసిఆరే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కెసిఆర్.. కుమ్మక్కై కృష్ణా జలాలను ఎపికి ధారాదత్తం చేశాడని మండిపడ్డారు. మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు దోచుకున్నారని స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ల పేరుతో కెసిఆర్ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. కాంగ్రెస్ బడ్జెట్ ను విమర్శించే వారంతా మూర్ఖులేనన్నారు. బడ్జెట్ ను విమర్శిస్తున్న కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులను ప్రజలు అసహ్యించుకున్నారని తెలిపారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ డిల్లీకి వెళ్లి లిక్కర్ అమ్మిన ఘనురాలు కవిత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News