Sunday, December 22, 2024

జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ  : కెసిఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. విజిలెన్స్ విచారణ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీని అడ్డుకోలేరని ఆయన నొక్కి చెప్పారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత జగదీష్ రెడ్డిని జైలుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పారగాన్ స్లిప్పర్లు వేసుకున్న జగదీష్ రెడ్డికి ప్రస్తుతం వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని, ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఇక తమ కుటుంబంలో బావ, బామ్మర్దులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో జగదీశ్‌రెడ్డి బ్రోకర్ లాగా వ్యవహరించారని అన్నారు.

ఇలాంటి చిల్లర వ్యక్తి నిత్యం ప్రజల్లో, ప్రజల కోసం బతికే తనపై ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసినవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా త్యజించిన చరిత్ర తనద అన్నారు. మద్యపాన నిషేదం సమయంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన చరిత్ర జగదీష్ రెడ్డిదని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి తనపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కుంభకోణం, భద్రాద్రి ప్లాంట్‌లో అక్రమాలు, ఛత్తీస్‌గఢ్ కరెంట్ కొనుగోళ్లలో దోపిడీలు బయట పెడుతున్నాననే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తానని మంత్రి పేర్కొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News