Tuesday, January 21, 2025

ఎంబిబిఎస్ విద్యార్థికి సాయం చేసిన మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంబిబిఎస్ విద్యార్థికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎంబిబిఎస్‌లో సీటు సాధించి కాలేజీ ఫీజు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్న పేదింటి విద్యార్థిని చదువుకు అండగా నిలిచారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సలాబత్ పూర్కి చెందిన కాట్రాజ్ సుమలత ఇటీవల ఎంబిబిఎస్ సీటు సాధించారు. అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు సుమలత కుటుంబం ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థిని సుమలతకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. సుమలత చదువు పూర్తయ్యే వరకు అన్ని విధాలుగా ఆదుకుంటానన్నారు. ఈ మేరకు విద్యార్థిని కాలేజీ ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు. ఈ ఏడాది కాలేజీ ఫీజుతో పాటు పుస్తకాలు, బట్టలు, ఇతర ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందజేశారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్థి సుమలత, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News