Wednesday, January 15, 2025

చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవిని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి ఇంటికి వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా చిరంజీవిని అభినందించారు. చిరంజీవికి శాలువాకప్పి, మంత్రి కోమటిరెడ్డి పుష్పగుచ్చం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగు ప్రజల తరఫున, చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులను చిరంజీవి పొందాలని కోరుకుంటున్నానని మంత్రి తెలిపారు. చిరంజీవి సందేశాత్మక సినిమాలు తీశారని అన్నారు.

తాను యువకుడుగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమాలను చూసేవాన్ని అంటూ మంత్రి పేర్కొన్నారు. ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు పొందడం గర్వకారణమన్నారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి ‘విశ్వంభర’ వరకు సాగుతున్న సినిమా ప్రస్థానమని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. రక్తదానం, నేత్రదానంతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున చిరంజీవికి మరోసారి అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. చిరంజీవికి భారత రత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకయ్య నాయుడులకు ఈ అవార్డులు రావడం తెలుగు వారికి గర్వకారణమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News