Sunday, April 27, 2025

త్వరలో కాళేశ్వరం కథ తెలుస్తది: మంత్రి కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. తెలివి ఉన్న వారెవరైనా కాళేశ్వరం ప్రాజెక్టు చేపడతారా ? మేడిగడ్డ కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా గత పాలకులు మాట్లాడారు. కానీ, ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిందన్నారు. వాటిలో నీళ్లు నింపితే ఈపాటికే మొత్తం కొట్టుకుపోయేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి తుమ్మిడిహట్టి సరైన ప్రాంతమని ఇంజినీర్లు చెప్పినా పట్టించుకోలేదని, తుమ్మిడిహట్టి పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే పక్కన పెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News