Thursday, January 23, 2025

డిఎస్‌సి అభ్యర్థుల్లో మెగా ఆశలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిపికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క సరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫి బ్రవరిలో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ వి డుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ప్రకటించడంతో లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. గతంలోని ఖాళీల కు తోడుగా ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టు ల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో రాష్ట్రంలో బి.ఇడి, డి.ఇడి పూర్తి చేసి టె ట్ ఉత్తీర్ణత సాధించి సర్కారు కొలువే ల క్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతున్న వేలాది మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశ లు చిగురించాయి. గతేడాది విడదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వా రందరూ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం తో సన్నద్ధం కానున్నారు. ఇందుకోసం సొంతూళ్లు వదిలి శిక్షణ కోసం నగరాలకు బాట పట్టేందుకు సిద్ధమవుతున్నా రు. ఈ ఏడాది భర్తీ చేస్తే ఉపాధ్యాయ ఖాళీలతో లక్షల మంది ఉపాధ్యాయ అ భ్యర్థులు పోటీ పడనున్నారు.

ఎన్ని పోస్టులకు డిఎస్‌సి?
మెగా డిఎస్‌సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందా..? అని టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్‌సి ద్వారా సుమారు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు స మాచారం. గత మూడున్నర నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండగా.. తక్కువ పోస్టులకే జా రీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్‌సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలోనే పేర్కొంది. అలాగే గతేడాది డిసెంబర్ 15వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థికశాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అడ్డంకులెన్నో…
డిఎస్‌సిపై ప్రకటన వస్తే లక్షలాది మంది టీచర్ అభ్యర్థులు కోచింగ్‌లో కోసం హైదరాబాద్ బాట పడుతుంటారు. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. కొంత మంది ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నా, ఆ ఉద్యోగాలను విడిచిపెట్టి ప్రభుత్వ టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం మెగా డిఎస్‌సి నిర్వహణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వాతావరణమే మళ్లీ కనిపించనుంది. అయితే, విద్యాశాఖలో పదోన్నతులు చేపడితేనే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై స్పష్టత వస్తుంది. టెట్ అర్హత ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మెగా డిఎస్‌సిపై నోటిఫికేషన్‌కు ముందు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది, ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగన్నుయి. ఎన్నికల కోడ్ కారణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కాలయాపన జరిగే అవకాశం ఉంది. ఇవేవీ అడ్డంకి కాకుండా నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
పాత నోటిఫికేషన్‌కు అనుబంధ నోటిఫికేషన్..?
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫిషన్ జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ఖాళీల రోస్టర్ విధానాన్ని ప్రకటించారు. గత నోటిఫికేషన్‌కు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదాపడిన డిఎస్‌సిని నిర్వహిస్తారా..? లేక కొత్త షెడ్యూల్ ఇస్తారా..? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయ పదోన్నతులు పూర్తయితే మరికొన్ని ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తున్నట్లు తెలిసింది. అయితే కోర్టు కేసులతో నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులకు, డిఎస్‌సికి ముడిపెడితే నియామకాలు పూర్తికావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News