Thursday, December 26, 2024

సెప్టెంబర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ పనులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే వారంలో జాతీయ రహదారుల హైలెవల్ కమిటీ రాష్ట్ర పర్యటనకు వస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. న్యాక్‌లో జాతీయ రహదారులపై రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె డ్డి శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన (ఐఏఎస్), జాయింట్ సెక్రటరీ హరీశ్ (ఐఎఎస్), ఎన్‌హెచ్‌ఎఐ రీజనల్ అ ధికారి కుష్వాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. టు మల్కాపూర్ జాతీయ విస్తరణ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సమావేశం ని ర్వహించారు.

మన్నెగూడ రహదారికి మార్గం సు గమం చేసేందుకు, ఎన్జీటి ఆదేశానుసారం 915 చెట్లను రీలొకేట్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రహదారి విస్తరణ పనులకు అడ్డు గా ఉన్న వాటర్ లేన్, ట్రాన్స్-కో సమస్యలపై సం బంధిత అధికారులతో మాట్లాడానని మంత్రి కోమటిరెడ్డి తెలిపా రు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని, ఎక్కడ అలసత్వం ఉం డొద్దని అధికారుల కు మంత్రి సూచించారు. కాంట్రాక్టు సంస్థ 300 చెట్లను రీలొకేట్ చేసేందుకు సిద్ధంగా ఉందని మం త్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మిగతా 615 చెట్లను అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల అధికారులు రీలొకేట్ చేయాల్సి ఉంటుందని మం త్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి రజాక్‌ను మంత్రి ఆదేశించారు.

పకడ్బందీగా కసరత్తు చేయాలి
ఆర్‌ఆర్‌ఆర్‌పై మరింత పకడ్బందీగా కసరత్తు చేయాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో అధికారులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్‌హెచ్ 65 (హైదరాబాద్ టు విజయవాడ) జాతీయ రహదారికి సంబంధించిన కాంట్రాక్ట్‌ను ఫోర్ క్లోజ్ చేసి వచ్చే నెలలో కొత్త టెండరఖలను పిలిచి సెప్టెంబర్‌లో పనులు ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూ పొందించామని, ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ప్రతిదీ నిత్యం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఆర్మూర్ టు మంచిర్యాల్ జాతీయ రహదారి కోసం 530 హెక్టార్ల భూమిని సేకరించామని అధికారులు మంత్రితో పేర్కొన్నారు. ఉప్పల్ టు ఘట్‌కేసర్ ప్లైఓవర్ పనులకు సంబంధించి కొ త్త టెండర్‌లను పిలుస్తున్న నేపథ్యంలో వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీ సుకురావాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News