Friday, February 21, 2025

ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా?

- Advertisement -
- Advertisement -

రాజలింగమూర్తి హత్య వెనుక
బిఆర్‌ఎస్ నేతల హస్తం
కిరాయి గూండాలతో చంపించారు
నిప్పులు చెరిగిన మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాజలింగమూర్తి హత్యపై
ముఖ్యమంత్రి సీరియన్
వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం
తరలో సిబిసిఐడికి కేసు అప్పగింత
భూవివాదంతోనే హత్య?
మన తెలంగాణ/హైదరాబాద్ :బిఆర్‌ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగమూర్తిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్య వెనుక కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావుల పాత్ర కీలకంగా ఉందని రో డ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రె డ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కిరాయి గూండాలతో ఈ హత్య చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రోపించారు. గురు వారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ ఫ్యామిలీ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు దోచుకున్న బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు హత్యా రాజకీయాలు ప్రారంభించిందన్నారు. కాళేశ్వరంలో కెసిఆర్‌కు శిక్ష పడుతుందని కెటిఆర్ ఆదేశాలతోనే మాజీ ఎమ్మె ల్యే గండ్రావెంకటరమణారెడ్డి తన భర్తను హత్య చేయించారని మృతుడి భార్య, కూతురు ఆరోపిస్తుంటే గండ్రా వెంకటరమణారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి పోలీసులకు లొంగిపోమని చెప్పకుండా హరీశ్ రావు ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా వా టర్ అంటూ డైవర్ట్ చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. హరీశ్ రావు నీవు మనిషివే నా? నీకు మానవత్వం ఉందా అని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు.

హత్య కేసును సిబిసిఐడీ విచారణకు అప్పగించాలి
రాజలింగమూర్తి హత్య కేసును సిబిసిఐడీ విచారణకు అప్పగించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఈ హత్యను సిఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణలో హత్యా రాజకీయాలకు తావు లేదన్నారు. కాళేశ్వరంలో కెసిఆర్‌కు దోషిగా శిక్ష పడుతుందని కెసిఆర్, కెటిఆర్ హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెబుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితులకు బిఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. వరంగల్‌లో ఎంపిడిఓను బిఆర్‌ఎస్ వాళ్లే హత్య చేశారని అప్పటి సిపి రంగనాథ్ చెప్పారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. కెసిఆర్ కిరాయి హత్యలు చేయించడమే తప్ప కెసిఆర్‌తో ఏమీ కాదని మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు. కెసిఆర్ 15 నెలల నుంచి ఫాంహౌస్ నుంచి ఎప్పుడైనా బయటకు వచ్చారా? అని ఆయన నిలదీశారు.

చక్రధర్‌గౌడ్‌కు రక్షణ కల్పిస్తాం
లగచర్లలోనూ కలెక్టర్‌పై హత్యాయత్నానికి పాల్పడింది బిఆర్‌ఎస్‌కు చెందిన సురేశ్ అని ఆయన పేర్కొన్నారు. ఆయనపై రౌడీ షీట్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగకుండా ఉండటమే బిఆర్‌ఎస్ లక్ష్యమన్నారు. కాం గ్రెస్ గ్రాఫ్ తగ్గిందని కెసిఆర్ అంటున్నారని, హత్యలు రాజకీయాలే మీ గ్రాఫా..? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. కిరాయి హత్యలు చేయించడం తప్ప కెసిఆర్‌తో ఏమీ కాదని మంత్రి అన్నారు. అవినీతిపై పోరాడే వారికి తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. హరీశ్ రావు మీద పోరాటం చేస్తున్న చక్రధర్‌గౌడ్ కు రక్షణ కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణను పదేళ్లు దోచుకొని ఎదురు తిరిగిన వాళ్లను చంపేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News