ఆక్రమణకు గురవుతున్న ఆర్ అండ్ బి
ఆస్తుల సంరక్షణకు చర్యలు చేపట్టండి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు
రహదారుల నిర్మాణం చేపట్టండి
నిధుల కొరత లేదు..పనులు పూర్తవుతున్న
కొద్ద్దీ కేటాయింపులు చేస్తాం ఆర్ అండ్ బి
ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం
భట్టి విక్రమార్క , మంత్రి కోమటిరెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వే గవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువా రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖ ఫ్రీ బడ్జెట్ సంవత్సరం పలు అంశాలు చర్చించా రు. రీజినల్ రింగ్ రోడ్డు డి పి ఆర్, త్రీ డీ డిజైన్లు వంటి పనులు వేగవంతం చేయండి, నిధుల కొరత లేదని వారు తెలిపారు. ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించండి, పెద్ద సంఖ్యలో ఉన్న విలువైన ఈ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు అన్ని స్థాయిల్లో చర్యలు చేపట్టాలని ఇరువురు మంత్రులు ఆదేశించారు. హెచ్‌ఎఎం (హైబ్రిడ్ యాన్యూటీ హెడ్) రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. వివిధ పనులపై ప్రతిరోజు వేలాదిమంది జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు వివిధ పనుల కోసం వస్తుంటారని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చాం, గత పది సంవత్సరాలు పాలించిన వారు ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తిరిగి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చట్టం నిధుల మేరకు స్థానికంగా పనులు చేపడుతున్న విషయాన్ని ఆ ప్రాంత నేతలు, ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆర్ అండ్ బి శాఖ అధికారులపై ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్,డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్,సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రెటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.