ఇక నుంచి సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్ చేస్తే తమ కార్యకర్తలే చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా పేరుతో అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తనను ట్రోల్ చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో అప్పులు, వడ్డీల లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారని అన్నారు. ఈ నెల 15 నెలల్లో తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4500 కోట్లే అని చెప్పారు.
సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మా కార్యకర్తలే చూసుకుంటారు:మంత్రి కోమటిరెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -