Wednesday, January 22, 2025

తెలుగు సినిమాకు మళ్లీ నంది పురస్కారాలు

- Advertisement -
- Advertisement -

ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డుల పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. వచ్చే ఉగాదినాటికి అవార్డుల ప్రదానోత్సవం జరిగేలా చూస్తామన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని మంత్రి చెప్పారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మురళీ మోహన్ విజ్ఞప్తి మేరకు నంది పురస్కారాల విషయమై సినీ పెద్దలను త్వరలోనే ఆహ్వానిస్తానని, అందరం కలసివెళ్లి ముఖ్యమంత్రితో చర్చిద్దామని సూచించారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా సినిమాలకు నంది అవార్డుల ప్రదానం జరగడం లేదు.  చివరిసారిగా 2017లో నంది అవార్డుల ప్రదానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన కళాకారులకు నంది అవార్డులు ఇస్తామని ఏపి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఇటీవల ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News